4U...


అణువణువు ప్రకృతి పలకరిస్తే

వీచేగాలుల్లో సుమగంధం పరిమళించదా ...


Don't you believe this ..?

Let's feel the Magic ...


నీలాల నింగిలో " చందమామ "

కొలను నీటిలో " కలువభామ "

దూరమెంత భారమైన " ఆపేనా "

మూగ బాసల " వలపు సరాగాలు " ...


Don't be surprised , It's real

Ok ! Open your Heart and

join with me for a minute ...


कभी कभी ...

कभी कभी मेरे दिल में ख़याल आता है

की जैसे तुझको बनाया गया है मेरे लिए ...


నవమి నాటి " వెన్నెలలో "

దశమి నాటి " జాబిలివై "

కదలి రావా " కార్తీక పౌర్ణమిలా " ...

That is the reason , I am waiting

I am waiting ... for you !!

--- రమణ


WHO AM I ...


ఊరించే ఆశలకే రెక్కలొస్తే
సువిశాల గగన వీధుల్లో
స్వేచ్చా పావురమై విహరించనా
నింగినేలను ఏకంచేసే రంగుల హరివిల్లునై ...

రోజువారి దినచర్యలో తలమునకలై
అలసిన తనువు మనసుకు
పైరగాలినై సేద తీర్చనా
పసిపాప పెదవిపై తరగని చిరునవ్వునై ...

గర్జించే శ్రావణ మేఘం
తొలకరి చినుకుల వరమిస్తే
పరవశించే పుడమినై పులకరించనా
సెలయేటి గగలల పలకరింపులతో ...

కష్టాలు కన్నీళ్ళు ఆకలికేకలు
రవ్వంతైనా కరుణించని అదృష్టదేవత
ఈ విదివంచితుల వెతల బ్రతుకుల్లో
కారుచీకటిలో కాంతిరేఖనై వెలుగునింపనా
కుటిల నాయకుల పాలిట సింహ స్వప్న మై ...

గురుతేలేదు నా నిన్నామొన్నా
ఆనందం అంచున నే నిల్చున్నా
సంతోష సామ్రాజ్య చక్రవర్తినై
చెరగని సంకల్పం తరగని ఆయుధమై ...
Catch me ! who am i...
--- రమణ



THE MAGIC ...

అనుక్షణం నీ ఆలోచనలతో
సాగే నా ఈ నిరీక్షణలో ...!
సాయం రాదే కదిలే సమయం
కలలే అలలై ఎగిసిన కనులకు ...!
మై మరచి పోయాను నీలో నన్నే
మాటే రాని చూపుల మాయజాలంలో ...!
నిను చూసాక నా మనసుకేమైందో
రేవులో నావలా నీ జతే కోరగా
ఆ నింగి ఈ నేలతో నేస్తమే కోరింది ..!!
.... రమణ



THE SUNSHINE ...

నిను చూసిన తొలిక్షణం
రవికిరణం తాకిన కుసుమంలా
మదిలో ఎగిసిన చిరుఅలజడి
ఎదలోతుల్లో తియ్యని విరహం రేపింది...!


చంద్రునికే " వెన్నెల " నీవా
సూర్యునికే " వెలుతురు " నీవా
ఊరించే నా "మధుర స్వప్నం " నీవేనా...!


రానా.. విరిజల్లు చినుకై నీకోసం
రానా.. సిరిమువ్వ సవ్వడినై నీమదిలోకి
ఎవరి కోసం నీ ఈ జాబిలి రూపం ...!


తడబాటు తప్పదు మరి నీ ఎడబాటులో
సందేహాల నివృత్తిలో ఎన్నాళ్ళు నా ఈ నిరీక్షణ...!!
---రమణ


THE RAINBOW...

వినీలాకాశంలో వెండి మబ్బుల సోయగం

పైరగాలి పల్లకిలో చిరుజల్లుల ఆహ్వానం

తొలకరి పలకరింపుల పుడమితల్లి పరవశం...!


ఆ నింగికి ఈ నేలకు కుదిరితే స్నేహం

Italic కనుల ఎదుటే కమనీయ దృశ్యకావ్యం

ప్రకృతికాంత నుదుటిపై హరివిల్లె సింధూరం...!!

--- సిద్దు ,ఆశ్రిత ,హ్రుత్విక్ ,రమణ


THE TRUTH ...


అనంతమైన నీ ఆలోచనా స్రవంతిలో

నా మనసంతా నీ రూపమే నిలిచింది

ఆశలపల్లకిలో మది తియ్యని గీతం పలికింది

కదిలే సమయం చెరగని మధుర స్వప్నంలా మిగిలింది

ఊహలకే రెక్కలోస్తాయని ఇప్పుడే కదా తెలిసింది..!!

---రమణ



Feel It ....

జీవితం మధురమైన మకరందం లాంటిది

సీతాకోకచిలుక రెక్కల రంగులు

పసిపాప బోసినవ్వులు

తొలకరి చినుకులు

మట్టివాసన మోసుకొచ్చే గాలులు

పౌర్ణమి జాబిలి వెన్నెల చల్లదనం

నిలాకాశంలో మెరిసే తారల సోయగం

సెలయేటి గలగలలు

గడ్డిపూల పలకరింపులు

తుమ్మెదల సరిగమలు

పక్షుల కిలకిల రావాలు

ఇవన్ని ఆస్వాధించాలన్నా , ఆనంధించాలన్నా

మనిషే కావాలి , మనిషిగా పుట్టి తీరాలి ....!!

.... రమణ


WITH OUT YOU...

అందమైన ఈ ప్రపంచంలో
అనగనగా ఒక రోజు....!

రాత్రి , పగలు

సూర్యుడు , చంద్రుడు
అంతాకలిసి 24 గంటలే....!


ప్రతి గంటకు 60 నిమిషాలు
ప్రతి నిమిషానికి 60 క్షణాలు....!


అనుక్షణం నీ ఆలోచనలతో సాగే నా ఈ నిరీక్షణలో
అందరిలో ఒకడిగా ఉంటూనే ఒంటరినైపోతున్నాను....!


ఒకే ఒక్కసారి నీ దర్శనమిచ్చి
ఓదార్చాలేవా నా ప్రియ నేస్తమా..!!

--- రమణ

మనసంతా.... నువ్వే


చిగురాకు నీవై చిరుజల్లు నేనై
నిను నేను చేరుకోవాలని ...
!


వేచిచుశా ఆశగా నీకోసం
అలసి సొలసిన తడికనులతో ...
!


ఎవ్వరు ఎదురుగా వస్తున్నా
అందరిలో నిన్నే చూస్తున్న ...
!


దారిలేదు చూడాలంటే చెలియను

వీలుకాదు
చెప్పాలంటే వేదనను ...
!


కురిసే వెన్నెల సాక్షిగా తెలుపనీ
నా మనసంతా .... నువ్వేననీ !!



--- రమణ











THE PRINCESS..

నులివెచ్చని ప్రభాతకిరణాల ఉషస్సులో
మంచులో తడిసిన ముత్యం లాంటి
కనులు తెరిచిన కలువను చూశాను...

ఎదలోతుల్లో జలతారువెన్నెల కురిసింది
వివరం చెప్పకనే విరహం రేపింది

కదలదు సమయం నీ పిలుపే వినకుంటే ...

తీరని దాహంలా తియ్యని స్వప్నంలా
నీ ఉనికే ఉన్నదిగా నాలో నిలువెల్లా
నీవే తోడని నీలో చేరితి క్రమంగా...

Yes ! u r my princess forever and ever....!!


---రమణ